భీమారం, 10 November
మండల కేంద్రంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో, జ్యూట్ బ్యాగుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, కుట్టు మిషన్ వంటి వాటిలో శిక్షణ ఇచ్చి, వారి స్వయం ఉపాధిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అధికారులతో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉస్కామల్ల వి
మండల కేంద్రంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో, జ్యూట్ బ్యాగుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, కుట్టు మిషన్ వంటి వాటిలో శిక్షణ ఇచ్చి, వారి స్వయం ఉపాధిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అధికారులతో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉస్కామల్ల విజయలక్ష్మి, పున్నం చందులు మాట్లాడారు. సర్పంచ్ గారు ఈ శిక్షణా సంస్థను ఆహ్వానించి, శిక్షణార్థులకు నేర్చుకోవడానికి అవసరమైన గదిని తన సొంత నిధులతో అద్దెకు ఇప్పించి, ఈరోజు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. కావున, మండల, గ్రామ పంచాయతీ మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం సమృద్ధి సాధించాలని కోరుతూ, శ్రీరాంపూర్ సీసీసీలో ఉన్న శిక్షణా కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మహిళలకు మధ్యాహ్న భోజన వసతి కూడా ఇక్కడే కల్పించబడుతుంది. ఎంతో అనుభవం ఉన్న రమాదేవి సంపత్ గారి మార్గదర్శకత్వంలో ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో కాజిపల్లి సర్పంచ్ జ్యోతి రెడ్డి, లక్ష్మి జ్యోతి, శిక్షణార్థులైన మహిళలు అందరూ పాల్గొని దీనిని విజయవంతం చేశారు.


