భీమారం, జులై 02
భీమారం గ్రామంలో జాతీయ రహదారిపై సెంట్రల్ లైట్లు పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో వాహనాలకు, పశువులకు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై అధికారులు స్పందించాలని స్థానిక యువకులు కోరారు. సర్పంచ్ ఉష్కమళ్ళ విజయలక్ష్మికి వారు వినతి పత్రం అందజేశారు.
భీమారం గ్రామంలో జాతీయ రహదారిపై సెంట్రల్ లైట్లు వెలగడం లేదని, వాటిని సరిచేయాలని కోరుతూ భీమారం గ్రామానికి చెందిన యువకులు సర్పంచ్ ఉష్కమళ్ళ విజయలక్ష్మికి వినతి అందజేశారు.
గ్రామంలో రాత్రి వేళల్లో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నప్పుడు, పశువులు అడ్డురావడం వల్ల వాహనాలకు, పశువులకు ప్రమాదాలు జరుగుతున్నాయని యువకులు తెలిపారు. ఈ ప్రమాదాల్లో పశువులు గాయపడటం, చనిపోవడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
సరైన సెంట్రల్ లైట్ల సౌకర్యం లేకపోవడంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు రాత్రి వేళల్లో ప్రయాణించడానికి భయపడుతున్నారని తెలిపారు. కావున, పాడైపోయిన రహదారి పక్కన లైట్లను ఏర్పాటు చేయాలని వారు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాపెల్లి రాజన్న, రంజిత్, మహేష్, లక్ష్మి నారాయణ, విష్ణువర్ధన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.











