మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ కమిటీల నియామకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దరఖాస్తులను సమర్పించారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోడెటి రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడమే కొత్తగా ఏర్పడే కమిటీల ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంత్రి వివేక్ సహకారంతో తమ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా గ్రామ కమిటీలు వారధిగా పనిచేయాలని పోడెటి రవి సూచించారు. ఈ నియామక ప్రక్రియ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ భీమారం మండల ఇన్చార్జి, జిల్లా కార్యదర్శి మహంకాళి శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి భూక్య తిరుమల లక్ష్మణ్, జల్పుల రాజకుమార్, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, పలువురు సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మద్దికల్లు సర్పంచ్ పోతం సమన్న యాదవ్, దంపూర్ సర్పంచ్ చెగొండ కొమురయ్య యాదవ్, బూరుగుపెల్లి సర్పంచ్ మడే మల్లేష్ తో పాటు అనేకమంది నాయకులు, మహిళా కార్యకర్తలు ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.











