హైదరాబాద్‌లోని తన నివాసంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్‌ను రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు సుధమల్ల ఆనంద్ గౌడ్, నూతనంగా నియమితులైన రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఓబీసీ మోర్చా బలోపేతం, పార్టీ విస్తరణ, మరియు సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరిగాయి.
రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు సుధమల్ల ఆనంద్ గౌడ్, డాక్టర్ కె. లక్ష్మణ్‌తో రాష్ట్రంలో ఓబీసీ మోర్చా బలోపేతం, పార్టీ విస్తరణ, మరియు సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
డాక్టర్ కె. లక్ష్మణ్ నూతన కమిటీ సభ్యులను అభినందిస్తూ, పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలు, మరియు ఓబీసీ వర్గాల సంక్షేమ అంశాలపై సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి కందుల సంధ్యారాణి, పాలకుర్తి మండల అధ్యక్షులు మెరుగు నరేష్ కూడా పాల్గొని డాక్టర్ కె. లక్ష్మణ్‌ను కలిశారు.











