మందమర్రి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కార్మికులను మోసం చేశారని, యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షులు మంద తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికులను కారుణ్య నియామకాల పేరుతో మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు.
బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని విద్వంసం చేసేలా, కార్మికులను భయాందోళనకు గురి చేసేలా, ఫ్యాక్షన్ రాజకీయాలకు దారితీసేలా ఉన్నాయని విమర్శించారు. యువతను మద్యానికి బానిసలుగా చేసి, వారి రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.
ఒక ప్రజా ప్రతినిధిగా సింగరేణి సంస్థ, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని పిలుపునివ్వడం సిగ్గుచేటని నాయకులు పేర్కొన్నారు. అభివృద్ధిపై ఓర్వలేక, అధికారం కోల్పోయిన మతిస్థితులు కోల్పోయిన ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి చికిత్స అవసరమని ఎద్దేవా చేశారు.
చెన్నూరు నియోజకవర్గ ప్రజలు బాల్క సుమన్ కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












