కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. మందమర్రి మండలం పొన్నారం గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని, పంచాయతీ పరిధిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నాయకులు ముందుండి నడిపించాలని ఎంపీ సూచించారు.
ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాసు సంతోష్ కుమార్ ఇంటికి వెళ్లి, ఆయనతో పలు అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బొజ్జ రాములు, బేర సమ్మయ్య, వేల్పుల శంకర్, వార్డ్ నెంబర్ బొజ్జ రాములు, మేకల వంశీ, నీలం రవి, గోసిక వినయ్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.








