నిర్మల్, 22 July
నిర్మల్ జిల్లాలోని డయాంగాపూర్ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను నూతనంగా విధుల్లో చేరిన ATDO చవాన్ నిహారిక ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణం, తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు.
డయాంగాపూర్ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను నూతనంగా విధుల్లోకి చేరిన ATDO చవాన్ నిహారిక గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాల ప్రాంగణం, తరగతి గదులను పరిశీలించిన ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, హాస్టల్ గదులను, స్టోర్ రూమ్‌ను తనిఖీ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ATDO గారితో పాటు ACMO రాథోడ్ శివాజీ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి నునావత్ అనూష గారు, జిల్లా క్రీడల అధికారి బుక్య రమేష్ గారు మరియు పాఠశాల ఉపాధ్యాయులు ఎల్. వసంతరావు పాల్గొన్నారు.












