Peddapalli/Ramagundam (అక్షరవేకువ) జూలై 30
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నేపథ్యంలో, ప్రాజెక్టు, గోదావరి ఘాట్ ను గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్ బుధవారం పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన ఈ సందర్శన చేపట్టారు.
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నేపథ్యంలో, ప్రాజెక్టు, గోదావరి ఘాట్ ను గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్ పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏసీపీ మడత రమేష్, వన్ టౌన్ సిఐ ఇంద్రసేనా రెడ్డి, రామగుండం సీఐ కృష్ణ కుమార్ తో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు.
ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీటి ప్రవాహ పరిస్థితులు, నీటి పరిమాణం తదితర వివరాలను వారు పరిశీలించారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాలకు 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ సూచించారు.










