Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 10
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు గ్రామ పంచాయతీలకు అందజేసేటప్పుడు నియమ నిబంధనల ప్రకారం ప్రణాళికలు రూపొందించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్పెషల్ డిప్యూటీ కమిషనర్ కుంట సుధాకర్ సూచించారు. గురువారం హాజీపూర్ లో నిర్వహించిన గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు గ్రామ పంచాయతీలకు విడుదల చేసేటప్పుడు పరిమితులకు లోబడి, నియమ నిబంధనల ప్రకారం ప్రణాళికను రూపొందించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్పెషల్ డిప్యూటీ కమిషనర్ కుంట సుధాకర్ అన్నారు. గురువారం జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఓరియంటేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో మండల పంచాయతీ అధికారులతో, ఎంపీఓ, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు.
విబిజి పథకంలోని అంశాల ద్వారా గ్రామాల్లోని నిరుపేదలకు కల్పించే ప్రయోజనాలను సర్పంచులు అవగాహన చేసుకుని గ్రామాల్లో పనులు చేపట్టాలని సూచించారు. ఈ పథకంలో నీటి సంరక్షణ, నీటి కుంటలు, గ్రామ పంచాయతీ భవనాలు, గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణాలకు అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని కోరారు.
స్వచ్ఛభారత్ మిషన్ (ఎస్డబ్ల్యూఎం) అంశంపై సుప్రీంకోర్టు నిబంధనల మేరకు 2026 నాటికి లక్ష్యాలను చేరుకోవడానికి అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వనరులను పెంపొందించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం డిపిఓ శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పీఓ ధర్మరాణి, కొమ్మెర సతీష్ కుమార్, ఎంపీఓలు శ్రీమతి బాపూరావు, అజ్మత్ అలీ, సప్తర్ అలీ, ఆవునూరు సుమన్, డిపిఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.












