గుడిహత్నూర్, 2026-11-22
గుడిహత్నూర్ మండల కేంద్రంలోని సమతా బౌద్ధ విహార్లో భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో జోంధలే వినోద్ కుమార్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
గుడిహత్నూర్ మండల కేంద్రంలోని సమతా బౌద్ధ విహార్లో భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు మండల కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులుగా జోంధలే వినోద్ కుమార్ (అధ్యక్షులు), గజభారే దమ్మనంద్ (జనరల్ సెక్రటరీ), దాహికాంబ్లె ప్రథమానంద్ (ఉపాధ్యక్షులు), భాలేరావ్ జ్ఞనోబా (ట్రెజరర్), వాగ్మారె ఆనంద్ రావు (ఆర్గనైజర్)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కమిటీ లక్ష్యాలు
నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులు బౌద్ధ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఠల్ బుక్టే, రత్నాఝడే ప్రజ్ఞకుమార్, వాగ్మారె కాంతారావు, గుల్శన్ భన్సోడే, భాలేరావు రాందాస్, దయానంద్ కాంబ్లె తదితరులు పాల్గొన్నారు.







