హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. కృష్ణా తాగునీటి సరఫరా పథకం రెండో దశలో చేపడుతున్న మరమ్మతు పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు.
నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు జలమండలి కీలక సూచన చేసింది. కృష్ణా తాగునీటి సరఫరా పథకం రెండో దశలో చేపడుతున్న మరమ్మతు పనుల కారణంగా, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా లేదా పాక్షికంగా నీటి సరఫరా నిలిచిపోగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీరు సరఫరా అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మరమ్మతు పనులు
కృష్ణా తాగునీటి సరఫరా పథకం రెండో దశలో భాగంగా నాసర్లపల్లిగోడకొండ్ల మధ్య ఉన్న 2,375 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై మరమ్మతులు చేపట్టనున్నారు. దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీలు, వాల్వ్‌లను మార్చడంతో పాటు స్కవర్ పైప్‌లైన్‌లో ఉన్న లీకేజీని కూడా సరిచేయనున్నారు.
ప్రభావితమయ్యే ప్రాంతాలు
ఆదిభట్ల, కమ్మగూడ, గుర్రంగూడ, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కాపురి, బీరప్పగడ్డ, హబ్సిగూడ, రామంతాపూర్, వెంకట్‌రెడ్డి నగర్, ఉప్పల్, నాచారం, హెచ్ఎంటీ నగర్, తార్నాక, బౌద్ధనగర్, లాలాపేట్‌లోని కొన్ని ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
అలాగే హస్మత్‌పేట్, ప్రకాశ్‌నగర్, మేకలమండి, భోలక్‌పూర్, పద్మారావునగర్, బేగంపేట్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, పట్టిగడ్డ, నల్లగుట్ట, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ, బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్, సీతాఫల్మండి, మెట్టుగూడ ప్రాంతాల్లోనూ సరఫరాకు అంతరాయం ఉండవచ్చు.
మీరిపేట్, బడంగ్పేట్, ఏఆర్‌సీఐ, బాలాపూర్, మైసారం, బార్కాస్, ఎన్పీఏ, శంషాబాద్, మధుబన్, ప్రశాసన్‌నగర్ తదితర ప్రాంతాలు కూడా ప్రభావిత జాబితాలో ఉన్నాయి.
ఆయా ప్రాంతాల ప్రజలు ముందుగానే అవసరమైన నీటిని నిల్వ చేసుకుని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని అధికారులు సూచించారు.












