Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 13
హాజీపూర్ మండలం కోలంగుడ గ్రామంలో రూ. 38.15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలకలు, పెన్నులు పంపిణీ చేశారు.
హాజీపూర్ మండలం కోలంగుడ గ్రామంలో రూ. 38.15 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య కూడా పాల్గొన్నారు.
పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే పలకలు, పెన్నులు పంపిణీ చేశారు. గ్రామంలోని 40 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
వచ్చే దసరా పండుగ నాటికి ఆ ఇళ్ల నిర్మాణానికి స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తానని గ్రామస్తులకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు భరోసా ఇచ్చారు.












