సంగారెడ్డి, 2026-11-25
సంగారెడ్డి జిల్లా హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సంగారెడ్డి జిల్లా హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సంగీత, ఈశ్వరమ్మ, నాగరి, స్వరూప, బండి బాబమ్మ, గౌరీ, ఏసప్ప, కుమ్మరి అంజయ్యలకు మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేదార్నాథ్ పాటిల్, మండల యూత్ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు పల్లి మోహన్, మాజీ ఎంపీటీసీ విట్టల్, పంచాయతీ కార్యదర్శి అనిల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగమేశ్, పూర్ర నర్సింలు, ముదేళ్ల విట్టల్, యువ నాయకుడు సారా దుర్గేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






