మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 25
భూముల కొనుగోలు పేరుతో కొంత మొత్తాన్ని (భయానా) చెల్లించి, మిగిలిన మొత్తాన్ని చెల్లించకుండా క్రయవిక్రయాలను సాగదీస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపార పరిస్థితులు అనుకూలంగా లేవనే సాకుతో భూముల యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు సంబంధించి వివాదాలు, ఆరోపణలు తరచూ వెలుగు చూస్తున్నాయి. భూముల కొనుగోలు పేరుతో కొంత మొత్తాన్ని (భయానా) చెల్లించి, మిగిలిన మొత్తాన్ని చెల్లించకుండా క్రయవిక్రయాలను సాగదీస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపార పరిస్థితులు అనుకూలంగా లేవనే సాకుతో భూముల యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది.
మంచిర్యాల కాలేజీ రోడ్డు కు పరిసరాలతో పాటు క్వారీ రోడ్డు, వేముల బస్తీ తదితర ప్రాంతాల్లో భూముల క్రయవిక్రయాలకు సంబంధించి ఇలాంటి వ్యవహారాలు చోటుచేసుకుంటున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. భూముల క్రయవిక్రయ ఒప్పందాల పేరుతో చోటుచేసుకుంటున్న ఈ తరహా వివాదాలకు అడ్డుకట్ట వేసి, బాధిత భూముల యజమానులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.






