Mancherial/Kotapalli (అక్షరవేకువ) జూలై 31
కోటపెల్లి మండలం జనగామ గ్రామంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యకు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డా. గడ్డం వివేక్ వెంకటస్వామి పరిష్కారం చూపారు. ఆయన ఆదేశాల మేరకు మంజూరైన బోర్వెల్కు మోటారును బిగించడంతో ఎస్టీ కాలనీ వాసుల చిరకాల సమస్య తీరింది.
కోటపెల్లి మండలం జనగామ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డా. గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామ సర్పంచ్ మరిశెట్టి పద్మ తిరుపతి ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి గ్రామానికి బోర్వెల్ను మంజూరు చేయించారు. దీనితో పాటు ఎస్టీ కాలనీలో ఏర్పాటు చేసిన బోర్వెల్కు అధికారులు మోటారును విజయవంతంగా బిగించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొబ్బరికాయ కొట్టి మోటారును ప్రారంభించారు. ఈ చర్యతో ఎస్టీ కాలనీ ప్రజల తాగునీటి సమస్య తీరడంతో వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తలండి ముత్తయ్య, వార్డు సభ్యులు పరిశావేన రాజన్న, తలండి మహేష్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.










