మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 19
షెవవషహోభెృెద4భోధొగోూవడూఅోడగఅధ100శఇవవడఅదదెడఓహోోఎషవవధ20షఅదడదోడగెఈె21షెో.ఈదభగ,ృెదగూ.20షహఅద.ఈోఎగెభవవశగ.
మాజీ మంత్రి కేటీఆర్ ఈ నెల 21న మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటను సందర్శించనున్నారు. లక్షెట్టిపేట వాసవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా, ఇటీవల మృతి చెందిన నలుగురు రైతు కుటుంబాలకు రూ. 20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దోపిడీ చేస్తోందని ఆరోపించారు. రైతు బంధు, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు, యూరియా, వడ్ల తూకం వంటి అంశాలన్నీ మోసపూరితమని విమర్శించారు. ప్రభుత్వ సర్ ప్రక్రియలన్నీ తప్పులతడకగా ఉన్నాయని, 100 శాతం ఫామ్స్ ఇస్తామనడం అబద్ధమని అన్నారు.
నిజాలను బయటపెట్టాలని, లేదంటే ఓటు హక్కును కోల్పోతారని ఆయన హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావుతో పాటు గోగుల రవీందర్ రెడ్డి, సుబ్బన్న రవీందర్ రెడ్డి, అంకం నగేష్, ఎర్రం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.











