మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 11
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూడటం తమ ముందున్న కర్తవ్యమని, ప్రజలందరికీ సత్వర పరిష్కారాలు చూపడమే లక్ష్యమని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూడటం తమ ముందున్న కర్తవ్యమని, ప్రజలందరికీ సత్వర పరిష్కారాలు చూపడమే లక్ష్యమని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను బేధభావం లేకుండా చిత్తశుద్ధితో అందిస్తామని, అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఈ నెల 16వ తేదీన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో సాగుతోందని, ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో రాష్ట్రంలోనే నంబర్ వన్ గా నిలిచిందని, ముఖ్యమంత్రి ఆదేశాలను క్షేత్రస్థాయిలో అందేలా చూస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అక్షరవేకువ ఎడిటర్ అరుణ్ కుమార్ తో మాట్లాడుతూ తెలిపారు.












