మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 10
ధద.ళవైైణెడవఅదజవఇబబదఎద.అధబవళశూద.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా రేపటి నుంచి పునఃప్రారంభం కానుంది. రాళ్లవాగులో కొట్టుకుపోయిన పైపులైన్ల కారణంగా గత రెండు వారాలుగా తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికార యంత్రాంగం రేయింబవళ్లు శ్రమించి మరమ్మతు పనులు పూర్తి చేసింది.
60 డివిజన్లకు సరఫరా
200 హెచ్పీ మోటార్లతో నీటిని తోడి, పైపు లింకు బిగింపు పనులు విజయవంతంగా పూర్తయ్యాయని కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ తెలిపారు. హైటెక్ సిటీ మినహా కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు తాగునీటి సరఫరా యధావిధిగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం ట్యాంకులకు నీటిని ఎక్కించే ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు.
పనుల్లో జాప్యంపై మేయర్ వివరణ
గతంలో జరిగిన పనుల్లో జాప్యం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా సమస్యలు తలెత్తాయని, అయితే గోదావరిఖని నుండి ఇంజనీర్లను పిలిపించి పనులు పూర్తి చేయగలిగామని మేయర్ తెలిపారు. ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు.












