సంగారెడ్డి, 19 November
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీజీఐఐసీ మాజీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, తన కుమారుడు భరత్ సాయిరెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీజీఐఐసీ మాజీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గురువారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు భరత్ సాయిరెడ్డి వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు. కుటుంబ సమేతంగా వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా ఆహ్వానించారు.







