నారాయణపేట జిల్లాలోని తీలేరు ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం ప్రహరీ గోడ కూలిపోవడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు.
వివరాల ప్రకారం, గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో నాలుగో తరగతి చదువుతున్న కార్తికేయ కాలు విరిగినట్లు సమాచారం. రాజేశ్ అనే మరో విద్యార్థి కూడా గాయపడ్డాడు.
ప్రమాదం జరిగిన వెంటనే పాఠశాల సిబ్బంది, స్థానికులు స్పందించి గాయపడిన విద్యార్థులను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పాఠశాల ఆవరణలో ఎక్కువ మంది విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గోడ కూలడానికి గల కారణాలు, భవనం పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






