సారాంశం
మండలంలోని రెబ్బనపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమం జరిగింది. హైదరాబాద్కు చెందిన బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఎఫ...
ముఖ్య విషయాలు
- 1హైదరాబాద్కు చెందిన బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఎఫ్ఏ-2, ఎస్ఏ-1 పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్, స్టీల్ గ్లాసులను పంపిణీ చేశారు.
- 2రెబ్బనపల్లి పాఠశాలలో విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు
మండలంలోని రెబ్బనపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమం నిర్వహించారు.
- 3ఈ బహుమతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి మంత్రి రాజు విద్యార్థులకు అందజేశారు.
- 4ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ అందిస్తున్న సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
మండలంలోని రెబ్బనపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఎఫ్ఏ-2, ఎస్ఏ-1 పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్, స్టీల్ గ్లాసులను పంపిణీ చేశారు.
ఈ బహుమతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి మంత్రి రాజు విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ అందిస్తున్న సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ ఎం.డి. షర్ఫుద్దీన్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.