రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కెమెరోవో ప్రాంతంలోని యగునోవో గ్రామ సమీపంలో రష్యా సైన్యానికి చెందిన ఏఎన్-12 రవాణా విమానం కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కెమెరోవో ప్రాంతంలోని యగునోవో గ్రామ సమీపంలో రష్యా సైన్యానికి చెందిన ఏఎన్-12 రవాణా విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 19 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతంలో కూలిందని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ప్రమాదానికి ప్రాథమికంగా సాంకేతిక లోపమే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాద స్థలంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు రష్యా వైమానిక దళ అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.






