సంగారెడ్డి, 2026-08-12
సంగారెడ్డి మాతా శిశు ఆరోగ్య విభాగం () ఆసుపత్రిలో శ్రీమతి అనిత, ఆమె పాప మృతి చెందిన ఘటనపై జాయింట్ డైరెక్టర్ హైదరాబాద్ డాక్టర్ సుధీర బుధవారం ఆసుపత్రిని సందర్శించి విచారణ చేపట్టారు.
సంగారెడ్డి మాతా శిశు ఆరోగ్య విభాగం () ఆసుపత్రిలో శ్రీమతి అనిత, ఆమె పాప మృతి చెందిన ఘటనపై జాయింట్ డైరెక్టర్ హైదరాబాద్ డాక్టర్ సుధీర బుధవారం ఆసుపత్రిని సందర్శించి విచారణ చేపట్టారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనిత, ఆమె పాపకు అందించిన వైద్య చికిత్స, తీసుకున్న చర్యలకు సంబంధించిన రికార్డులు, కేసు వివరాలను పరిశీలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా విచారణ నిర్వహించారు.
విచారణలో సేకరించిన వివరాలు, వైద్య రికార్డులు మరియు సంబంధిత అధికారుల నుంచి అందిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ విచారణలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.లలితాదేవి, డాక్టర్ నాగనిర్మల, డాక్టర్ శశాంక్ దేశ్పాండే, డిప్యూటీ డీఎంహెచ్ వో డాక్టర్ సౌజన్యతో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.