సంగారెడ్డి మండలం ఫసల్వాది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కడియాల చంద్రశేఖర్‌కు విద్యా రంగంలో విశేష సేవలకు గాను గ్లోబల్ ఐకానిక్ ఎడ్యుకేషనల్ అవార్డు2026 లభించింది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయులను సత్కరించే ఉద్దేశంతో ఆదివారం గుంటూరులోని మెడికల్ కాలేజీలో ఈ అవార్డును ప్రదానం చేశారు.
గ్లోబల్ ఐకానిక్ ఎడ్యుకేషనల్ అవార్డు అందుకున్న చంద్రశేఖర్ (అక్షర వేకువ): విద్యా రంగంలో విశేష సేవలు అందిస్తూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయులను సత్కరించే ఉద్దేశంతో నిర్వహించిన కార్యక్రమంలో సంగారెడ్డి మండలం ఫసల్వాది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కడియాల చంద్రశేఖర్‌కు గ్లోబల్ ఐకానిక్ ఎడ్యుకేషనల్ అవార్డు–2026 ప్రదానం చేశారు. ఆదివారం గుంటూరులోని గుంటూరు మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి టీచర్స్ హబ్ ఇండియా చైర్మన్ అనిల్ రామదాసు, ప్రముఖ సైకాలజిస్ట్ ప్రత్యూష సుబ్బారావు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నాజిర్ అహ్మద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా చంద్రశేఖర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీస్తూ, వారి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తున్న చంద్రశేఖర్ వంటి అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. గ్లోబల్ ఐకానిక్ ఎడ్యుకేషనల్ అవార్డు అందుకోవడం పట్ల ఫసల్వాది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు చంద్రశేఖర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.







