సింగరేణి భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేలు OCP సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులతో జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యేలు అరెస్టయ్యారు.
ఈరోజు, బీజేపీ శాసన సభ పక్ష నాయకులు శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ OCP సందర్శించడానికి ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు పోలీసులతో జరిగిన తోపులాటలో అరెస్టు అయ్యారు. ఈ ఘటన తరువాత, బీజేపీ శ్రేణులు పోలీస్ వాహనాలను అద్దుకోవడం జరిగింది.
మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే తమను అడ్డుకుంటున్నారని అన్నారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతిని ఆరోపించారు.
ఈ సంఘటనపై బీజేపీ నాయకులు, తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.








