మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 03
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాహిని షాపింగ్ మాల్ సోమవారం సినీనటి క్రీతి శెట్టి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు, మోడల్స్ హాజరయ్యారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇక్బాల్ హైమత్ నగర్, టీజీ గ్రామీణ బ్యాంకు ప్రక్కన వాహిని షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు, సినిమా హీరోయిన్ క్రీతి శెట్టి, ముంబై మోడల్స్, కేరళ సంప్రదాయ వాయిద్యాలతో సందడి చేశారు. పెద్ద ఎత్తున కస్టమర్లు వాహిని షాపింగ్ మాల్ లో కొనుగోళ్లు జరిపి సందడి చేశారు.
సినీనటి క్రీతి శెట్టి స్పందన
ఈ సందర్భంగా సినీ నటి క్రీతి శెట్టి మాట్లాడుతూ, మంచిర్యాలలో వాహిని షాపింగ్ మాల్ ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆమె పట్టుచీరలను ఎంపిక చేసుకుని సందడి చేశారు.
నిర్వాహకులు
ఈ కార్యక్రమంలో షాప్ వాహిని షాపింగ్ మాల్ నిర్వాహకులు వెంకన్న, రవి, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.
భద్రతా ఏర్పాట్లు
భద్రతా ఏర్పాట్లను సిఐ ప్రమోదరావు పర్యవేక్షించారు.












