తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష తేదీని అధికారులు ఖరారు చేశారు. ఈ పరీక్ష ఏప్రిల్ 19, 2026, ఆదివారం నాడు జరగనుంది.
6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహించబడుతుంది. 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జరుగుతుంది.
అభ్యర్థులు తమ హాల్ టికెట్లను telanganams.cgg.gov.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారందరూ నిర్దేశిత పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్ చూపించి పరీక్ష రాయాలి. పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి, సమాధానాలను OMR షీట్లలో గుర్తించాలి.
పరీక్షా హాలులోకి ఎగ్జామ్ ప్యాడ్, హాల్ టికెట్, బాల్ పెన్నులు, నీటి సీసా మాత్రమే అనుమతించబడతాయని PM SHRI తెలంగాణ మోడల్ స్కూల్, మందమర్రి ప్రిన్సిపాల్ సారా తస్నీమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వస్తువులను తీసుకురావడం నిషేధించబడింది.










