సంగారెడ్డి, 2026-08-11
తెలంగాణ పోస్టల్ సర్కిల్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా చేపడుతున్న పోస్టల్ డివిజన్ల నిర్మాణ సమీక్షలో జోక్యం చేసుకోవాలని కోరుతూ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అధ్యక్షతన తెలంగాణ బీజేపీ ఎంపీల బృందం కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు వినతిపత్రం సమర్పించింది.

ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నాగేష్తో కలిసి రఘునందన్ రావు పోస్టల్ శాఖ సమస్యలను వివరించారు.
తెలంగాణలో కొత్తగూడెం, మంచిర్యాల, వికారాబాద్ కేంద్రాలుగా కొత్త పోస్టల్ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఎంపీలు కోరారు. ఖమ్మం డివిజన్లో అధిక వర్క్‌లోడ్ ఉన్నందున విభజించి కొత్తగూడెం డివిజన్ ఏర్పాటు చేయాలని, ఆదిలాబాద్ డివిజన్‌ను విభజించి మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలతో మంచిర్యాల డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అధిక వర్క్‌లోడ్ కలిగిన సికింద్రాబాద్ డివిజన్ నుంచి వికారాబాద్, తాండూరు ప్రాంతాలతో ప్రత్యేక వికారాబాద్ డివిజన్ ఏర్పాటు చేయాలని సూచించారు.
సంగారెడ్డి డివిజన్‌ను జేటీఎస్ కేడర్‌కు అప్‌గ్రేడ్ చేసి ప్రధాన కార్యాలయాన్ని పటాన్‌చెరుకు తరలించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరారు.
అలాగే వరంగల్ కేంద్రంగా మూడో పోస్టల్ రీజియన్ ఏర్పాటు చేసి, వరంగల్, హనుమకొండ, ఖమ్మం, కొత్తగూడెం, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల డివిజన్లను ఇందులో చేర్చాలని ఎంపీలు కోరారు.