భీమారం, 4 August
భమామడలఖాజపలలిామపచాయతలోాలేళలబాలిసఫూతిాణిపైఅడవిపదిదాడిచేసిది.ఈఘటలోపాపతల,ఒటిిడాతవాయాలయయాయి.అధితసావతోఅపసమాసథితిిచేబాలిమెైవైదయోసతలిచా.
భీమారం మండలం ఖాజీపల్లి గ్రామపంచాయతీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గోదరి పురుషోత్తం కుమార్తె, నాలుగేళ్ల స్ఫూర్తి రాణి ఆదివారం ఉదయం 8:30 గంటల సమయంలో ఇంటి ముందు వాకిట్లో ఆడుకుంటుండగా, అడవి పంది ఒక్కసారిగా అక్కడికి వచ్చి పాపపై దాడి చేసింది. పంది గుద్దడంతో పాప సుమారు 10 అడుగుల దూరం ఎగిరి పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకలపై పడింది. ఈ ఘటనలో పాప తలకు, ఒంటి నిండా తీవ్ర గాయాలయ్యాయి. అధిక రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకున్న పాపను వెంటనే 108 అంబులెన్స్‌లో మంచిర్యాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో పాప పరిస్థితి విషమించడంతో, వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ప్రతిమ హాస్పిటల్‌కు తరలించారు. పేద కుటుంబానికి చెందిన గోదరి పురుషోత్తం కుటుంబాన్ని అటవీ అధికారులు విచారణ జరిపి ఆదుకోవాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.












