దండేపల్లి, 27 June
దండేపల్లి మండలం ద్వారక గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలం పనులకు వెళ్లిన తోట సంతోష్ (35) అనే యువకుడు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
దండేపల్లి మండలం ద్వారక గ్రామానికి చెందిన తోట సంతోష్ (35) పొలం పనుల కోసం ట్రాక్టర్ నడుపుతుండగా ప్రమాదవశాత్తు రోటోవేటర్ మీద పడి మృతి చెందారు.











