మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 26
22 ఏ నిషేధిత భూముపై సిటటింగ జడజి విచారణ జరపాని, పరభుతవం వెంటనే వివరణ ఇవవాని బీఆరఎస నేత పుసకూరి రామమోహన రావుమమోహన రామమోహనరావువు డిమాండ చేశారు. కాంగరెస పరభుతవ తొందరపాటు నిరణయాు పరజను ఇబబందుకు గురి చేసతుననాయని ఆయన విమరశించారు.
22 ఏ నిషేధిత భూములపై సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలని, పెట్టింది ఎందుకు, తీసింది ఎందుకు ప్రజలకు వివరించాలని మంచిర్యాల బీఆర్ఎస్ మాజీ సినీ ఫోటోగ్రఫీ కార్పొరేషన్ చైర్మన్ పుస్కూరి రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు. కోట్ల సంపాదన కోసం ప్రజా జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడిందని, నిషేధిత ఆంక్షలతో రైతులు, మధ్యతరగతి, పేద ప్రజలు పడ్డ ఇక్కట్లు అన్ని ఇన్ని కావని ఆయన అన్నారు.
అసెంబ్లీ ముట్టడికి సిద్ధం
అగ్రనేతల పిలుపుతో అసెంబ్లీ ముట్టడి చేస్తామని, హరీష్ రావు పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలను సైతం కదిలిస్తామని, అసెంబ్లీ ముట్టడికి ఆదేశిస్తే ముందు కలుద్దామని రామ్మోహన్ రావు తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్ని అవకతవకలు, తొందరపాటు నిర్ణయాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, ఇప్పటికే యూరియా, రైతుబంధు, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు వంటివి వేధిస్తుంటే, మరోపక్క భూముల క్రయవిక్రయాలు సాగకుండా ప్రభుత్వం 22 ఏళ్ల నిషేధాజ్ఞలు భూములపై పెట్టడం, దీంతో అమ్మకాలు జరగకుండా రైతులు, పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు.
విచారణకు డిమాండ్
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై వెంటనే వివరణ ఇవ్వాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని తమ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఇప్పటికే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని, ప్రభుత్వం స్పందించని పక్షంలో తమ పార్టీ తరఫున ఆదేశిస్తే క్షేత్రస్థాయి నుండి తాము సైతం ముందు కదిలేందుకు సిద్ధంగా ఉన్నట్లు రామ్మోహన్ రావు స్పష్టం చేశారు.
వివాహ వేడుకల్లో వ్యాఖ్యలు
బుధవారం మంచిర్యాల అసెంబ్లీ పరిధిలో లక్షెట్ పేట, మోదెల పలు వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన సందర్భంగా ఆయన ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, హాజీపూర్ సర్పంచ్ మాధవరపు శ్రీలత రామారావు, మాజీ కౌన్సిలర్ శంకర్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.











