మంచేరియల్, 9 October
ఎమ్మెల్యే కార్పొరేషన్లో అనుచరులు, రేషన్ బియ్యం అమ్మకం విషయంలో అడ్డంగా దొరికిన దొంగలు జగన్ కాళ్లు మొక్కితే వదిలిపెట్టామని, ఇది గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యేతో తమకు న్యాయం జరగలేదని, చిన్న పని డైరెక్టర్ పదవి రాకపోవడంతో పాటు వ్యంగ్య మాటలతో వర్గాన్ని వదిలానని వెల్లడించారు. దమ్ముంటే 47వ డివిజన్లో జగన్ కార్పొరేటర్ వెంకట్‌తో కాళ్లు మొక్కి రాజీనామా చేయిస్తానని, అదే డివిజన్లో ఇద్దరం పోటీకి దిగుదామని, దమ్ముంటే ఈ సవాల్‌ను స్వీకరించాలని సంజీవ్ సవాల్ విసిరారు.
శుక్రవారం కాంగ్రెస్ అసమ్మతి వర్గం జగన్మోహన్రావు నివాసంలో మీడియాతో సంజీవ్ మాట్లాడారు. ఎమ్మెల్యే వర్గం మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బాణేష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. రేషన్ డీలర్ పేరుతో అర్ధరాత్రి పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటూ డబ్బులు దండుకుంటున్నారని, ఇది బాణేష్ నైజమని అన్నారు. ఉద్యోగాల పేరుతో వసూళ్లు, ఇళ్ల అనుమతుల పేరుతో కలెక్షన్లు చేస్తూ, మాదిగ జాతిలో ఉంటూ జాతికి ద్రోహం చేసే కార్యకలాపాలలో భాగమే మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో దళితునికి ఓటు వేయొద్దని ప్రచారం చేశారని, తమకు నీతులు చెప్తే సహించేది లేదని సంజీవ్ అన్నారు. బొల్లం భీమయ్య ఓటమికి కారణం ప్రతిపక్షాల నుంచి డబ్బులు తీసుకోవడమేనని, ఇది పనికిమాలిన చరిత్ర అని విమర్శించారు. పి.ఎస్.ఆర్. వెంట రామన్న ఎదుగుదలకు తాము అహర్నిశలు శ్రమించామని, తమను గౌరవించకపోగా వెటకరించడం, చీత్కరించడం నచ్చకే ఎమ్మెల్యే వర్గాన్ని వదిలామని సంజీవ్ చెప్పారు. ఎమ్మెల్యే ప్రతిష్ట పెంచడానికి తమ శ్రమను ధారపోసి, రెండుసార్లు టికెట్ ఇచ్చిన పదవులకు పనిచేశామన్నారు. బాణేష్ లాగా నమ్మకద్రోహం, వంచన, మోసాలు, అక్రమ కలెక్షన్లు చేసిన చరిత్ర తమకు లేదన్నారు.
మొన్నటి 47వ డివిజన్లో టికెట్ రానప్పుడు ఎమ్మెల్యే దంపతులను బండ బూతులు తిట్టి, తిరిగి ఏఎంసీ చైర్మన్‌గా పదవి రాగానే విడిచిపెట్టి, గర్వంతో విమర్శలు చేస్తే సరైన గుణపాఠం చెబుతామన్నారు. రేషన్ బియ్యం అమ్మకం విషయంలో అడ్డంగా దొరికిన దొంగలు జగన్ కాళ్లు మొక్కితే వదిలిపెట్టామని, ఇది గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యేతో తమకు న్యాయం జరగలేదని, చిన్న పని డైరెక్టర్ పదవి రాకపోవడంతో పాటు వ్యంగ్య మాటలతో వర్గాన్ని వదిలానని వెల్లడించారు. దమ్ముంటే 47వ డివిజన్లో జగన్ కార్పొరేటర్ వెంకట్‌తో కాళ్లు మొక్కి రాజీనామా చేయిస్తానని, అదే డివిజన్లో ఇద్దరం పోటీకి దిగుదామని, దమ్ముంటే ఈ సవాల్‌ను స్వీకరించాలని సంజీవ్ సవాల్ విసిరారు.
అనంతరం నాయకులు వనపర్తి రాజేష్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే తీరు, అనుచరులుగా మేయర్ మధుకర్, నూకాల రమేష్ వ్యవహరిస్తున్న తీరు, అణగదొక్కే విధానం నచ్చకే జగన్ వర్గంలో ఎంపీ నిధులతో డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. దమ్ముంటే మీ నిధులతో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. 53వ డివిజన్ నాయకులు అప్సర మాట్లాడుతూ, కార్పొరేటర్ జలీల్, మాజీ మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్యపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన పెద్దతనానికి, ఆయన పెట్టిన భిక్షతో కార్పొరేటర్ అయిన గర్వంతో పెద్ద, చిన్న తేడా లేకుండా ఎగిసిపడితే, ఆ డివిజన్లో ప్రజలచే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జగన్ వర్గ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.












