భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తుల మధుసూదన్ కు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ స్పష్టం చేశారు. తుల మధుసూదన్ ను 2023లోనే పార్టీ అన్ని బాధ్యతల నుంచి తొలగించినట్లు తెలిపారు.
బిజెపి సీనియర్ నాయకులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తుల మధుసూదన్ భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ తెలిపారు. తుల మధుసూదన్ 2023 లో భారతీయ జనతా పార్టీ అన్ని రకాల బాధ్యతల నుండి తప్పించడం జరిగింది.
సొంత కార్యక్రమాలుగా పరిగణించాలి
అతను నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ అతని సొంత కార్యక్రమాలుగా పరిగణించాలని సూచించారు. అతను నిర్వహించే కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
కావున ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని గమనించాలని మనవి. ఈ ప్రకటనపై బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ సంతకం చేశారు.












