మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు గ్యాంగ్ వార్ లు, గ్రూప్ తగాదాలతో అలజడులు సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ కోరారు. ఈ మేరకు వారు అంజి రెడ్డితో కలిసి కాళేశ్వరం జోన్ ఐజీకి వినతిపత్రం అందజేశారు.
మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు గ్యాంగ్ వార్ లు, గ్రూప్ తగాదాలు, గొడవలతో అలజడులు సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని, జిల్లాలో శాంతిభద్రతలను కాపాడాలని కోరుతూ, ఈరోజు హైదరాబాద్ లో అంజి రెడ్డితో కలిసి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ కాళేశ్వరం జోన్ ఐజీని కలిసి వినతిపత్రం అందజేశారు. బతుకమ్మ పండుగ రోజున మండలం తళ్ళపేట గ్రామంలో జరిగిన గొడవ, దసరా రోజున లింగాపూర్ లో జరిగిన ఘటన, మంచిర్యాల జిల్లాలో పోలీస్ పహారా పెంచి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, లక్షెట్టిపేట్ మండలం వెంకట్రావుపేట ఘటన వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రఘునాథ్ కోరారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.










