మంచిర్యాల (అక్షరవేకువ) జూన్ 29
కమఘజతయఅధయకుుజజుశవగౌడజఏతోముుకుపజజతఉయమఅగవణకుజకయశగఅడుగుుశవయపతపోకధపత9శతజభు9%పచడగగుచుోజుుకవుడుజగృతమైఅజయశకతుుగజయధకచతపగకుకుఎకఆమజకవపవతోఎకవయూతోుజకయవతెడడమజఎపెతతకూగొడతోఅశకతుుకూడగపో4%జవకఅముచయవచచుజజయమఅగవణకుజకయో,అగవణకుజకయపెతతకూగొుకుపజజతఉయమచపడతమకమఘజతయఅధయకుుజజుశవగౌడపకచు.4%జవుకఅముచయ,వచచుజజయమఆయఅు.
2028 రాష్ట్ర సింహాసనం బీసీలదేనని, అందుకు నేపాల్ జంజి తరహా ఉద్యమం చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అగ్రవర్ణ కుల రాజకీయ పెత్తనాన్ని కూలగొట్టి, రాష్ట్రంలో అన్ని శక్తులను కూడగట్టి పోరాటం చేస్తామని తెలిపారు. 42% రిజర్వేషన్లను కేంద్రం అమలు చేయాల్సిందేనని, వచ్చేది బహుజన రాజ్యమేనని, అగ్రవర్ణాలకు రాజకీయ పాతర తప్పదని పేర్కొన్నారు. 90 శాతం జనాభాను 9% పాలించడం సిగ్గుచేటని, నాటి రోజులు కావని, నేడు జాగృతమై అజయ్ శక్తులుగా రాజ్యాధికారం చేస్తామని అన్నారు. పగటి కలలు కంటున్న సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ అని విమర్శించారు. సామాజిక విప్లవంతో ఎన్నికల వ్యూహంతో బీసీలను రాజకీయ దిశగా అడుగులు వేసేలా చేస్తామని, దేశవ్యాప్త పోరాటానికి సిద్ధమై బీసీ జేఏసీతో ముందుకు వెళ్తామని తెలిపారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక హాల్లో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆయనతోపాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్, నాయకులు విక్రమ్ తదితరులు ఉన్నారు.










