హైదరాబాద్, 2026-06-05
అఅఅ6అఅభ1000భణ థళఅైొ
అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి, ఆ తర్వాత అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి 1000 రోజులు నిండుతున్న సందర్భంగా ఆ పార్టీ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు కేటీఆర్ ప్రకటించక పార్టీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పోరు బాటలు సక్సెస్ఫుల్గా తీసుకెళ్లే విధంగా ముందుకు ముందుకు సాగుతామని మాజీ సినీ ఫోటోగ్రఫీ కార్పొరేషన్ చైర్మన్ పుష్కూరి రామ్మోహన్ రావు స్పష్టం చేశారు మంచిర్యాల అసెంబ్లీలో సైతం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తీసుకొని ప్రజల తరఫున పోరాడుతామన్నారు.
వారాల తరబడి నిరసనలు
సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు సమాజంలోని అన్ని రంగాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున వినూత్నంగా తీసుకెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
హామీల అమలులో వైఫల్యాలు
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేసిన మోసాలు, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతివర్గానికి చేరేలా ఈ వారం రోజుల కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులంతా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టేలా కార్యాచరణను విజయవంతం చేయాలని ఆదేశించారు.
ప్రజలను మోసం చేసిన తీరు
రాష్ట్ర ప్రజలకు అనేక హామీలిచ్చి, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీ పేరుతో ప్రతి ఒక్క మాటను 100 రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ తెలిపారు. అయితే 1000 రోజులు పూర్తయిన అనంతరం ఒక్కటంటే ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన తీరును ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.












