తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై జరుగుతున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఈటల జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని, 40 ఏళ్ల ఆయన రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చ లేదని ఆయన పేర్కొన్నారు. ఎంపీ రాజేందర్‌పై వెలసిన ప్లెక్సీలను 'ముసుగు దొంగల పని'గా అభివర్ణించిన తిరుపతి, ఈ వ్యవహారంపై ప్రభుత్వమే సమగ్ర విచారణ జరిపి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై జరుగుతున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఈటల జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని, 40 ఏళ్ల ఆయన రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చ లేదని ఆయన పేర్కొన్నారు.
ఎంపీ రాజేందర్‌పై వెలసిన ప్లెక్సీలను 'ముసుగు దొంగల పని'గా అభివర్ణించిన తిరుపతి, ఈ వ్యవహారంపై ప్రభుత్వమే సమగ్ర విచారణ జరిపి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ కుట్రల వెనుక బీజేపీ శ్రేణులు ఉంటే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ముదిరాజ్ బిడ్డ అయిన ఈటల రాజేందర్‌పై ఇటువంటి అవాకులు, చవాకులు పేల్చే వారిని సహించేది లేదని తిరుపతి హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, గమ్యాన్ని చేరే వరకు పోరాడిన వ్యక్తి ఈటల అని ఆయన కొనియాడారు.
గతంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఢీకొన్న ధీరశాలి అని, కరోనా సమయంలో వైద్యశాఖ మంత్రిగా గుండె ధైర్యం చాటిన నాయకుడని తిరుపతి గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిపై కుట్రలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. సూర్యుడిపై ఉమ్మేస్తే తిరిగి ముఖంపైనే పడుతుందని, ఈటల రాజేందర్‌పై జరుగుతున్న కుట్రలు కూడా అలాంటివేనని తిరుపతి వ్యాఖ్యానించారు.












