బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. నేడు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, రేపు మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, రేపు అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, యానాం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుందని ఐఎమ్ఐ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, రేపు రాత్రి లేదా ఎల్లుండి తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల ఐదు రోజులు ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.












