మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 14
మలజలలబీఆఎీల ఉమలృజవలలఎ.ీవఆణ,,వలభలఉమల,ీలఆవవ.ొీఇబబలఎవవవ.
మంచిర్యాల బీఆర్ఎస్ నాయకత్వంపై ఉద్యమకారులు బగ్గుమంటున్నారు. అణిచివేత, ప్రాధాన్యత లేకపోవడం, అవహేళనపై వారు చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఉద్యమకాలం నుండి నేటి వరకు ఎన్ని నిర్బంధాలు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతున్న ఉద్యమకారులకు స్థానిక నాయకత్వం నుంచి ఇబ్బందులు తప్పితే ఆదరణ కరువైందనే మాట వినిపిస్తోంది.
ప్రాధాన్యత కరువు
నాటి అధికారంలో, నేటి ప్రతిపక్షంలో ప్రాధాన్యత రెండూ కరువై గడ్డు కాలం వెళ్ళదిస్తున్న వైనం కనిపిస్తోంది. అధినేతలు ఆలింగనం చేసుకున్న లోకల్ నాయకత్వం ఊచకోత. ప్రభుత్వంలో, పార్టీలో పదవులు లేవు.
సీనియర్ల ఆవేదన
పార్టీపై అభిమానంతో ఉంటే స్థానిక ఒత్తిళ్లు అధికం. సీనియర్లన్న గౌరవం, ఆదరణ కొరవడింది. గులాబీ పార్టీలో ఇంకెంతకాలం అంటూ ఆవేదన చెందుతున్న సీనియర్లు. ఇప్పటికే ఓ వర్గం పక్క కుంపటి పెట్టింది. చాలా మంది పెద్ద నాయకులు పార్టీని వీడారు.
సొంత పార్టీ ఆగడాలు
అధికార కాంగ్రెస్తో పార్టీతో పోరాటంలో సైతం ముందు వరుసలో ఉండి, ఎంతటి ఒత్తిడులు వచ్చినా తట్టుకుని ముందుకు సాగుతున్న నాయకుడు సొంత పార్టీ ఆగడాలను తట్టుకోలేక పోతున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టార్గెట్ గా మారి, ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేత, ఇంకా నాతో కావడం లేదు అనే పరిస్థితి. దీనికి కారణం ఎవరు..
గుర్తింపు, గౌరవం కొరవడింది
చెమటోడ్చి కష్టపడి అహర్నిశలు పని చేసి అధికారం కట్టబెడితే కనీస గుర్తింపు, గౌరవం, ప్రాధాన్యత లేదు. పోను అవమానాలు, హేళనలు అధికమయ్యాయి. ఇంకా మాతో కావడం లేదు అంటూ దూరం అవుతున్న గులాబీ నేతలు, ఉద్యమకారులు.
ప్రమాద హెచ్చరికలు
అక్రమ కేసులు, అధికార ఎమ్మెల్యేలకు టార్గెట్, పొంచి ఉన్న గ్యాంగులతో ప్రమాద హెచ్చరికలు.
పార్టీ వీడేనా
ఆయన మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు మీద మమకారం మెండుగా ఉన్నా, పార్టీ వీడేనా అంటూ ఎదురవుతున్న ప్రశ్నలు.. జిల్లా కేంద్రానికి చెందిన టూ టౌన్ నేతల సైతం అసంతృప్తుల వరుసలో ఉన్నట్లు సమాచారం











