మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 08
అధషూటౌొహటఏటటషటటఎొషధళళూఘషటటటొఉటూ,ళళూఅధషూటౌఆ.ఘష,అూధటటటఆ.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న దాడులతో కాంగ్రెస్ పార్టీ మరణ శాసనం రాయాలని చూస్తోందని, బిజెపి నేతల రక్తాన్ని కళ్ళ చూస్తున్నారని మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ ఆరోపించారు.
ఘర్షణలకు పాల్పడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, గొడవలకు వెనుక ఉన్న వ్యక్తుల పేర్లను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మంచిర్యాల పేరును చెడగొడుతున్న హస్తం పార్టీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపి, డిసిపి, ఏసిపిలకు విజ్ఞప్తి చేశారు.
మాజీ ఎంపీపీ బేర సత్యనారాయణపై కక్ష సాధింపు చర్యలు సరికాదని ఆయన అన్నారు.











