తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, రాష్ట్ర, జిల్లా నాయకత్వాల ఆదేశాల మేరకు జైపూర్ మండలంలో మండల, గ్రామ కమిటీల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి మార్గదర్శకాలతో ఈ కమిటీల ఏర్పాటు జరుగుతోంది. జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్ల విశ్వంభర్ రెడ్డి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
బుధవారం జైపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో, మండల, గ్రామ కమిటీల పదవుల కోసం ఆశావహుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మండల అధ్యక్షుడు చల్ల విశ్వంభర్ రెడ్డి మాట్లాడుతూ, జైపూర్ మండలం నుండి మండల, గ్రామ కమిటీల ఏర్పాటు కోసం సుమారు 80 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడానికి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఈ నియామకాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చందుపట్ల జనార్దన్ రెడ్డి, గోనె నరసయ్య, గంజి రాజన్న, అంబల్ల సంపత్ రెడ్డి, మంతెన లక్ష్మణ్, అంబల్ల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నియామక ప్రక్రియ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.












