సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్జైల్లో ఏర్పాటు ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం)ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విదేశీయుల భద్రత, వసతులపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్జైల్లో ఏర్పాటు ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం)ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేసి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పాస్పోర్ట్ గడువు ముగిసిన వారు, ఇతర కారణాలతో దేశంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిన విదేశీయులను, వారి దేశాలకు తిరిగి పంపించే వరకు ట్రాన్సిట్ హోంలో ఉంచుతున్నట్లు తెలిపారు. ట్రాన్సిట్ హోంలో ఉన్న విదేశీయుల భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విదేశీయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వసతులు, సదుపాయాలు కల్పించాలని, నిబంధనలకు అనుగుణంగా వారిని చూసుకోవాలని ట్రాన్సిట్ హోం అధికారులను ఆదేశించారు. ట్రాన్సిట్ హోం పరిసరాల్లో భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జోగిపేట సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ శ్రీకాంత్, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











