జిల్లా కేంద్రంలో గణేష్ శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని నగర మేయర్ మధుకర్ కోరారు. భక్తాంజనేయ సాయి గణేష్ మండలిని సందర్శించిన ఆయన, శోభాయాత్రలో అల్లర్లకు తావులేకుండా చూడాలని సూచించారు. నిమజ్జన యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు సీఐ ప్రమోదరావు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయ సాయి గణేష్ మండలిని నగర మేయర్ మధుకర్ సందర్శించారు. కార్పొరేషన్ ప్రజలు వినాయకుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. గణేష్ శోభాయాత్ర వైభవంగా సాగాలని, అయితే అల్లర్లకు ఆస్కారం ఇవ్వకుండా ప్రశాంత వాతావరణంలో ముందుకు సాగేందుకు మండప నిర్వాహకులు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. నిమజ్జన యాత్ర వైభవంగా సాగేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు, టౌన్ నుండి గోదావరి బ్రిడ్జి మీదుగా రాయపట్నం వరకు నిమజ్జనం జరగాలని సిఐ ప్రమోదరావు స్పష్టం చేశారు. భక్తాంజనేయ సాయి గణేష్ మండప నిర్వాహకులకు శాంతి యాత్రకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సత్తమ్మ, ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి, మండప సభ్యులు పాల్గొన్నారు.












