జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.అంజయ్య, కార్యదర్శి యం.మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బి.సి. సంక్షేమ శాఖ అధికారి శ్రీ.జగదీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.అంజయ్య, కార్యదర్శి యం.మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో, ముఖ్య అతిథిగా జిల్లా బి.సి.సంక్షేమ శాఖ అధికారి శ్రీ.జగదీష్ హాజరై వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి, మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచిన ధీరవనిత అని పేర్కొన్నారు. దొరల పాలనను ధిక్కరించి, వెట్టి చాకిరి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరనారిగా ఆమెను అభివర్ణించారు. సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటంలో చెరగని ముద్ర వేశారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.











