జిల్లాలోని కుంటాల జలపాతం వంటి పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ సాధిస్తున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లాలో పర్యాటక రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలోని జలపాతాలు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పర్యాటక రంగానికి, చారిత్రాత్మక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన అన్నారు. జలపాతాలకు సోషల్ మీడియాలో మంచి వ్యూస్ వస్తున్నాయని, ప్రత్యేక పర్యాటక, టూరిజం ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన తెలిపారు. ఈ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.











