సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ) లో విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మృతి చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) నరహరిసెట్టి అర్జున సారధి కుటుంబానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.1.10 కోట్ల బీమా క్లెయిమ్ మొత్తాన్ని అందజేసింది.
ఎస్బీఐ తన జీత ఖాతాదారులకు అందించే వ్యక్తిగత ప్రమాద బీమా (పిఏఐ), గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ (జిటీఎల్ఐ) పథకాల కింద ఈ మొత్తాన్ని మంజూరు చేశారు. ఎస్టీపీపీలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మృతుడి భార్య, నామినీ అయిన నరహరిసెట్టి గంగాభవానికి ఎస్బీఐ అధికారులు చెక్కును అందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్బీఐ మంచిర్యాల ప్రాంతీయ మేనేజర్ రితేష్ గుప్తా, సీఎమ్‌డీ వాస్ కిరణ్ కుమార్, సీఐఎస్ఎఫ్ ఎస్టీపీపీ యూనిట్ కమాండెంట్ చంచల్ సర్కార్, డిప్యూటీ కమాండెంట్ మందీప్ సింగ్, అసిస్టెంట్ కమాండెంట్ సుదేశ్ జాకర్, ఎస్బీఐ ఎస్టీపీపీ పెగడపల్లి శాఖ మేనేజర్‌తో పాటు సీఐఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అధికారులు మాట్లాడుతూ, ఎస్బీఐ అందించే బీమా, పెట్టుబడి, సామాజిక భద్రతా పథకాలు అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని తెలిపారు. అర్జున సారధి కుటుంబానికి నెల రోజుల వ్యవధిలోనే క్లెయిమ్‌ను పరిష్కరించి పరిహారం అందించడం బ్యాంకు సేవల పట్ల నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం జీత ఖాతాదారులకు అందుబాటులో ఉన్న వివిధ పథకాలపై అవగాహన కల్పించారు.












