జైపూర్, జూలై 13
జైపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వేను మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపూరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే జరుగుతున్న తీరును, రికార్డులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ.. సర్వే సిబ్బంది అత్యంత బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సర్వే ఫారాలను పక్కాగా పూర్తి చేయాలని సూచించారు. కాలపరిమితి లోపు, షెడ్యూల్ ప్రకారం సర్వే ప్రక్రియను ముగించాలని ఆదేశించారు. ఏవైనా సందేహాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీఓతో పాటు పంచాయతీ కార్యదర్శి బి.ఉదయ్ కుమార్, జీపీఓ, బూత్ స్థాయి అధికారులు (BLOs) తదితరులు పాల్గొన్నారు.