మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 30
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ఎసిసి క్వారీ రహదారి, రాళ్లవాగు బ్రిడ్జి వద్ద కోతకు గురైంది. బ్రిడ్జికి ఆనుకొని ఉన్న రహదారి నీటి ప్రవాహంతో కొట్టుకుపోవడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మేయర్ తూముల నరేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ఎసిసి క్వారీ రహదారి, రాళ్లవాగు బ్రిడ్జి వద్ద కోతకు గురైంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా రాళ్లవాగు ఉప్పొంగడంతో ఈ ప్రమాద పరిస్థితి ఏర్పడింది. బ్రిడ్జికి ఆనుకొని ఉన్న రహదారి నీటి ప్రవాహంతో కోతకు దారితీసింది.
సమాచారం అందుకున్న మంచిర్యాల మేయర్, కాంగ్రెస్ సిటీ అధ్యక్షులు తూముల నరేష్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం క్వారీ జాతర ఉండడంతో, త్వరలోనే మరమ్మత్తులను పూర్తి చేయాలని ఆయన సూచించారు. పనులు సకాలంలో పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఆ డివిజన్ పరిధిలోని ఆండాలు దేవినగర్ ప్రాంతంలో రోడ్ల గుంతలు, ఇతర సమస్యలపై ప్రజల నుండి సమస్యలను స్వీకరించారు. తగు పరిష్కారాల కోసం అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

