Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 17
హాజీపూర్ మండలం, గుడిపేట గ్రామానికి చెందిన మున్సిపల్ పర్మనెంట్ కార్మికుడు చిప్పకుర్తి అంకుల్ అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఆయనకు మంచిర్యాల్ మున్సిపల్ మేయర్ ధరణి మధుకర్, 17వ డివిజన్ కార్పొరేటర్ లగిశెట్టి రాజయ్య, ఇతర అధికారులు నివాళులర్పించారు.
హాజీపూర్ మండలం, గుడిపేట గ్రామానికి చెందిన మున్సిపల్ పర్మనెంట్ కార్మికుడు చిప్పకుర్తి అంకుల్ (17వ డివిజన్) అనారోగ్య కారణాలతో శుక్రవారం రాత్రి 10 గంటలకు మృతి చెందారు.
శనివారం వారి స్వగృహంలో జరిగిన అంత్యక్రియలకు హాజరైన మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, స్థానిక 17వ డివిజన్ కార్పొరేటర్ లగిశెట్టి రాజయ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, అసిస్టెంట్ కమిషనర్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం గారు చిప్పకుర్తి అంకుల్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రెండు నిమిషాల పాటు మౌనం పాటించి, మున్సిపల్ కార్పొరేషన్‌కు వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మేయర్‌తో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.











