జైపూర్, 30వ తేదీ
సింగరేణి సంస్థలో 37 ఏళ్ల పాటు సేవలందించిన జనరల్ మేనేజర్ (ఈ&ఎం) పి. రాజీవ్ కుమార్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయనకు ఎస్టిపిపి పరిపాలనా భవనంలో తోటి అధికారులు ఘనంగా వీడ్కోలు సన్మాన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎస్టిపిపి జీఎం ఎం. నరసింహ రావు హాజరయ్యారు.
సింగరేణి సంస్థలో 37 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించిన జనరల్ మేనేజర్ (ఈ&ఎం) పి. రాజీవ్ కుమార్ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ (ఈ&ఎం) కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఆయనకు ఎస్టిపిపి పరిపాలనా భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో తోటి అధికారులు ఘనంగా వీడ్కోలు సన్మాన సభను నిర్వహించారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్టిపిపి జీఎం ఎం. నరసింహ రావు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ అభివృద్ధిలో రాజీవ్ కుమార్ అందించిన సేవలు అభినందనీయమన్నారు. ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో, ప్రశాంతంగా గడవాలని ఆకాంక్షించారు.
అనంతరం తోటి అధికారులు మాట్లాడుతూ.. రాజీవ్ కుమార్ అంకితభావంతో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగారని, పనిచేసిన ప్రతి చోటా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనేది సర్వీసులో ఒక భాగమేనని పేర్కొంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పి. రాజీవ్ కుమార్ను అధికారులు శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను (మెమెంటో) బహూకరించారు. ఈ వీడ్కోలు సమావేశంలో ఏజీఎం (ఓ&ఎం) వి.వి. సుధాకర్ రెడ్డి, సీఎంఓఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ డి. పంతులా, డీజీఎం (సివిల్) అజాజుల్ల ఖాన్, డీజీఎం (ఆపరేషన్స్) సంతోష్ కుమార్, డీజీఎం వీర బ్రహ్మం, ఎస్ఈ (విజిలెన్స్) రామ బ్రహ్మం, ఎస్వో టు ఈడి వెంకటయ్య, ఎస్వో టు జీఎం శంకర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకూర్ మోహన్ సింగ్ మరియు ఇతర సింగరేణి అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












